10 May, 2026 | 1:49 AM

ఆఫ్ఘాన్‌తో టెస్టుకు షమీ?

10-05-2026 12:45 AM

ముంబై , మే 9 : వెటరన్ పేసర్ మ హ్మద్ షమీ టీమిండియా రీఎంట్రీ ఇవ్వ బోతున్నట్టు తెలుస్తోంది. షమీ ఎంపిక పై బీసీసీఐ సెలక్షన్ కమిటీలో చర్చలు జరుగుతున్నాయి.  ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘని స్తాన్ తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం షమీకి చోటు దక్కనుందని స మాచారం.

షమీ గతకొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తు తం జరుగుతున్న ఐపీఎల్ లోనూ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు.  చివరిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ వెటరన్ పేసర్ ఆడాడు. ఈ మ్యాచ్ కోసం మరో సీనియర్ పేసర్ జస్ప్రీ త్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారు.