నేడు టీసీఏ ధర్నా
టీజీ20 లీగ్‌కు వ్యతరేకంగా నిరసన
హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతిపాదిత టీజీ20 లీగ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తన నిరసన గళాన్ని ఉధృతం చేసింది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధర్మ గురువారెడ్డి తెలిపారు.
ఈ ధర్నాకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మాజీ ఎంపీ బీబీ పాటిల్తో పాటు పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిర్వాహకులు, టీసీఏ నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. టీజీ20 టో ర్నీకి సంబంధించి టీసీఏ లేవనెత్తిన ప్రశ్నలకు హెచ్‌సీఏ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేదా బీసీసీఐ అనుమతులు బహిర్గతం చేయలేదని గురువారెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వేలం నిర్వహిస్తూ ముందుకు సాగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
అన్ని అనుమతులు ఉంటే వాటిని ప్రజల ముందుంచడంలో హెచ్‌సీఏకు భయం ఎందుకని ప్రశ్నించారు. ఆటగాళ్ల వేలా న్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లేదా జింఖానా మైదానంలో బహిరంగంగా నిర్వహించకుండా ప్రైవేట్ వేదికల్లో కార్యక్రమాలు జరపడం అనుమానాలను మరింత పెంచుతోందన్నారు.2018లో బీసీసీఐ జారీ చేసిన లేఖతో తమ వద్ద ఉన్న పలు ఆధారాలను ఇప్పటికే ప్ర జల ముందుంచామని, తెలంగాణ క్రికెట్ భవిష్యత్తు, పారదర్శకత, జవాబుదారీతనం, నిబంధనల అమలు పై చర్చించేం దుకు ఈ ధర్నా వేదిక కానుందని గురువారెడ్డి తెలిపారు. క్రికెటర్లు, క్లబ్ ప్రతినిధులు, క్రీడాభిమానులు, ప్రజ లు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ క్రికెట్ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.






