సైనికులే కాదు.. గూఢచారులూ త్యాగధనులే
- శత్రుదేశాల కుట్రలను వెలికితీయడంలో వారి సేవలు గొప్పవి
- ధురంధర్ సినిమా వీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో ఉండి పోరాడే సైనికులే కాకుండా, గూఢచారులు కూడా ఎంతటి త్యాగాలు చేస్తారో అనేది ధురంధర్ సినిమా ఎంతో స్పష్టంగా ప్రతిబింబించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, దేశ భద్రత కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటున్న గూఢచారుల నిజ జీవితాన్ని ఈ సినిమా కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుందన్నారు.
మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్‌లో రాంచందర్‌రావు, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యద ర్శితోపాటు మరికొంత మంది నాయకులతో కలిసి సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా కాలేజీ యువత ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరారు. దేశభక్తి, బాధ్యత వంటి విలువలను పెంపొందించేందుకు ఈ సిని మా అత్యంత ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనే క దేశాల్లో భారత గూఢచారులు దేశ సమగ్రత, భద్రత కోసం పనిచేస్తూ, శత్రుదేశాల కుట్రలను వెలికితీసే విధంగా సేవలు అందిస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా దేశభక్తి మాత్రమే కాదు, దేశ రక్షణపై బాధ్యతను కూడా పెంపొంది స్తుందన్నారు. ప్రత్యే కంగా, ఈ చిత్రంలో డీమానిటైజేషన్ వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందన్నారు. పాకిస్థాన్ నుంచి భారీస్థాయిలో నకిలీ నోట్లను పంపించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే కు ట్రలను, అలాగే చిన్నపిల్లలను దుర్వినియోగం చేస్తూ దేశంలో అశాంతిని సృష్టిం చాలనే ప్రయత్నాలను ఈ సినిమా బలంగా ప్రతిబింబించిందని చెప్పారు.
దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా ఈ చిత్రం నిజాయితీగా చూపించిందని, ఈ చిత్ర బృందాన్ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. సినిమా చూసిన వారిలో బీజేపీ నాయకులు గౌతంరావు, వీరేందర్‌గౌడ్, బండ కార్తీకరెడ్డి, ముఖ్యఅధికార ప్రతి నిధి ఎన్వీ సుభాష్ తదితరులున్నారు.




