8 April, 2026 | 3:48 AM

డంప్‌యార్డును తరలించాలి

08-04-2026 01:54 AM

మంత్రి తుమ్మలకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి

హుజురాబాద్, ఏప్రిల్ 07: (విజయక్రాంతి): వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ద్వారా హుజురాబాద్ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని, ప్రజల ఆరోగ్యమే కాకుండా సార వంతమైన నేల సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని ఈ ప్లాంటును వేరే చోటుకు తరలించాలని డంప్ యార్డ్ జేఏసీ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం విజ్ఞప్తి చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడితల ప్రణవ్, నాయకులు కలిశారు.

జేఏసీ నాయకులు, పాలకవర్గం, మున్సిపల్ పరిధిలోని నాయకులు హుజురాబాద్, సిర్సపల్లి డంప్ యార్డు ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలిపారు. ఈ ప్రాంత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వేస్ట్‌టు ఎనర్జీ ప్లాంట్‌ను వేరేచోటుకి తరలించాలని కోరారు. వీరి విజ్ఞప్తికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించినట్లు విజ్ఞాపన పత్రం అందజేసిన నాయకులు తెలిపారు.