దేశభద్రతలో ఐఐఎస్ అధికారుల పాత్ర కీలకం
- అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ట్రైనీ అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): దేశ భద్రత, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించే శక్తులను, కుట్రలను తిప్పికొట్టేందు కు సమయోచిత, వాస్తవిక, బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారుల పాత్ర చాలా కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 2009, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన గ్రూప్ ఏ ట్రైనీ అధికారులు ఈ నెల 15 నుంచి 22 వరకు అంతర్గత భద్రత, సంక్షోభ, విపత్తు కమ్యూనికేషన్, సైకాలజికల్ ఆపరేషన్స్‌పై అవగా హన పెంపొందించుకునేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ట్రైనీ అధికారులు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ పథకాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళుతున్నాయా? లేదా? అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపైనా కేంద్రమంత్రి ఆరా తీశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వేగంగా మారుతున్న సమాచార ప్రపంచంలో సమర్ధవంతమైన కమ్యూ నికేషన్ పరిపాలనా సాధనం మాత్రమే కాదని, జాతీయ స్థిరత్వానికి, ప్రజల విశ్వాసానికి మూలస్థంభమని చెప్పారు. దేశ అంత ర్గత భద్రతకు సంబంధించిన విషయానికొ స్తే.. మీడియా, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదారి పట్టించే ఫేక్ సమాచారం సవాల్ విసురుతున్న
నేటి తరుణంలో వాటి ని అధిగమిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అందించే ప్రత్యేక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, కేంద్ర హోంశాఖ మీడి యా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్, ఐఐఎస్ విభాగం కోర్సు డైరెక్టర్ రష్మీ రోజా తుషార నాయర్ తదితరులు పాల్గొన్నారు.




