7 July, 2026 | 3:57 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

హైడ్రాతో ఒరిగేదేమీ లేదు

31-08-2024 01:23 AM

బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతలతో రాష్ట్రం లో ఒరిగేదేమీ లేదని బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా కూల్చివేతలు కేవలం గ్లాడియేటర్ మూవీ స్క్రిప్ట్ లాంటివి మాత్రమేనని విమర్శించారు. చెరువుల ఆక్రమణపై హైడ్రా పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్‌ఆర్ పరిధి లోపలి చెరువుల్లో గత కొన్నేళ్లుగా ఇండ్లు కట్టుకొని.. ఎల్‌ఆర్‌ఎస్ కడుతున్నవారి ఇండ్లను కూడా కూల్చేస్తుం దా? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని.. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే ప్రజలే ఛీకొట్టే రోజులు తొందర్లోనే వస్తాయని కార్తీక్ రెడ్డి హెచ్చరించారు.