7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

జీహెచ్‌ఎంసీ స్థలం కబ్జా

31-08-2024 01:25 AM

 నిర్మాణాలు కూల్చివేయించిన డీసీ

రాజేంద్రనగర్, ఆగస్టు 30: జీహెచ్‌ఎంసీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టగా అధికారులు కూల్చివేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్కిల్ పరిధిలోని ఆప్కో కాలనీలోని సర్వే నంబర్ 156/1లో సుమారు 450 గజాల స్థలాన్ని కొందరు  ఆక్రమించుకొని అందులో నిర్మాణాలు చేపట్టారు.   విషయం తెలుసుకున్న సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తన సిబ్బందిని అక్కడికి పంపించారు. నిర్మాణాలను నేలమట్టం చేయించారు. జీహెచ్‌ఎంసీ స్థలంలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధ్యులపై పోలీసు కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.