వనమహోత్సవంలో మొక్కలు నాటిన పోలీసులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
06-07-2026 07:30 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ అన్నారు. భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.






