27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

ఎన్టీఆర్ జయంతి వేడుకలు

28-05-2026 03:21 PM

చందుర్తి,మే 28,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి వెంకటి  ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు  జయంతి వేడుకలను  గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు నెంబర్ వెంకటి మాట్లాడుతూ,  ఎన్టీఆర్  తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పాల్గొన్నారు.