14 July, 2026 | 3:25 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన

14-07-2026 02:47 PM

RAW NTR తిరుపతి ఈవెంట్ పై వివాదం నెలకొంది. RAW సంస్థతో తమకు సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భావన కలిగిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ తరుఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని ఎన్టీఆర్ తేల్చిచెప్పారు. సేవా కార్యక్రమాలు మా అధికారిక బృందం వెల్లడిస్తోందని ఎన్టీఆర్ తెలిపారు. అనధికారిక వ్యక్తులు, సంస్థల ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలకాలని కోరారు.

RAW NTRకు మాకు ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి, ప్రయేయం లేదని ఎన్టీఆర్ కార్యాలయం పేర్కొంది. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అభిమానులు, ప్రజలు నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దని ఎన్టీఆర్ ఆఫీస్ విజ్ఞప్తి చేసింది. తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశ ప్రకటన అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన చేసింది.