ఘనంగా మట్టల పండుగ
కేసముద్రం, మార్చి 29 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల ఎన్టీఆర్ నగర్ లో విట్నెస్ ఆఫ్ ట్రూ లైట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టలాదివారం వేడుకలు నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బిషప్ పిల్లి కుమారస్వామి మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే కు ముందు వచ్చే ఆదివారాన్ని క్రైస్తవులు మట్టలదివారంగా జరుపుకుంటారని, చరిత్రలో ఒక గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఏసుక్రీస్తును కూర్చుండబెట్టి దారి పొడుగునా బట్టలను, చెట్ల కొమ్మలను పరిచి ఏసుక్రీస్తుకు జయ గీతాలను పాడుతూ యెరూషలేము మందిరములోనికి ఆయనను తీసుకొని వచ్చే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులందరూ మట్టలాదివారంగా జరుపుకుంటారన్నారు.
ఈ సందర్భంగా భక్తులంతా ఏసుక్రీస్తుకు పాటలు పాడి ఆరాధన చేసి ఈత కొమ్మలను చేత పట్టుకొని చిన్నలు పెద్దలు అందరూ ఆరాధన చేశారు. రాజాధిరాజైన ఏసుక్రీస్తు ఒక గాడిద పిల్ల మీద శోభా యాత్రగా రావడానికి ఆయనలోని దీనత్వానికి సూచనగా ఉన్నదని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిల్లి సరిత, పిల్లి భరత్ భూషణ్, డోలి రాములు, సుగుణ, దాసరి ఏకాంబరం, దాసరి ప్రశాంత్, పెద్దపల్లి కళ్యాణ్ కుమార్, పిల్లి మాధురి, చేతి సౌజన్య, చేతి స్వాతి, పిల్లి పావని, పూస పద్మ, పూస నవ్య, చేతి అర్చన ,ఆశ్రయ, దాసరి భవాని లకావత్ బుజ్జి పాల్గొన్నారు.




