భారత్‌లో అణునిధి

11-09-2026 | 05:35am
  1. దేశంలో 190 అణ్వాయుధాలు.. 730కిలోల ఫ్లూటోనియం 

ఎఫ్‌ఏఎస్ ప్రకటన

పాక్‌ను దాటాం..తర్వాత బ్రిటనే!

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: అణ్వాయుధాల నిల్వలో భారత్ తన దాయాది దేశమైన పాకిస్థాన్‌ను అధిగమించింది. భారత్ వద్ద 190 అణ్వాయుధాలున్నాయి. మరో 35 అణుబాంబుల తయారీకి సరిపడా ఫ్లూటోనియం (730కి.గ్రా) కూడా ఉంది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్‌ఏఎస్) (Federation of American Scientists) తాజాగా ప్రకటించింది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో 170 అణ్వాయుధాలు ఉన్నాయని తెలిపింది.

త్వరలోనే బ్రిటన్ (225) నిల్వలను కూడా భారత దేశం అధిగమించే అవకాశం ఉందని ఎఫ్‌ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సెన్ తన ‘ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ -2026’ నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో రానున్న సమయంలో అణ్వాయుధాల నిల్వ పెరగవచ్చని ఎఫ్‌ఏఎస్ పేర్కొంది. భారత్ భూమి, ఆకాశం, సముద్రం ఇలా మూడంచెల భద్రతలో అణ్వాయుధాలను ఉపయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు