2 May, 2026 | 10:08 PM

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం

02-05-2026 08:48 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

కోదాడ,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోదాడ నియోజకవర్గ స్థాయి సమావేశం కోదాడలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు శానిటేషన్, త్రాగు నీరు, విద్యా, వైద్యం లపై అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా ప్రణాళికలు చేశామన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా అని అధికారులు మానిటరింగ్ చేస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.  ప్రజల సమస్యలను గుర్తించి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది కార్యచరణ తో ముందుకు వెళ్లాలని సూచించారు.  అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు.  అనంతరం కోదాడ నియోజకవర్గం లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫోటోతో కూడిన మెమొంటో మండలం వారీగా అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, డీఎఫ్ ఓ సతీష్, ఆర్డీవో సూర్యనారాయణ ఎస్సీ డీడీ దయానందరాణి మున్సిపల్ కమిషనర్ రమాదేవి అడిషనల్ పిడి సురేష్, అన్ని శాఖల జిల్లా ధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.