2 May, 2026 | 9:59 PM

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ

02-05-2026 08:50 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బత్తుల నగర్,కృష్ణ సాగర్ ఎస్టి కాలనీలోని అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు టి.హెచ్.ఆర్ (టేక్ హోమ్ రేషన్) గ్రామ సర్పంచ్ తాటి వాణి, ఉపసర్పంచ్ భూక్య మోహన్ రావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రంలో కల్పిస్తున్న సదుపాయాలు గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరు ధాన్యాలపై గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోని ఆరోగ్య వంతులుగా ఉండాలన్నారు.మాతా శిశు సంరక్షణ సంక్షేమం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అనంతరం పశువుల ఇంజక్షన్ కోసం ఏర్పాటు చేసిన పశువుల స్టాండ్ ను ఏర్పాటు చేశారు.