2 May, 2026 | 10:08 PM

సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి

02-05-2026 08:46 PM

- CSO (కార్పోరేట్) బాలరాజు

నస్పూర్,(విజయక్రాంతి): సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా సింగరేణి సెక్యూరిటీ విభాగం (S&PC) తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కృషిచేయాలని సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(కార్పోరేట్) బాలరాజు కోరారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి గెస్ట్ హౌజ్ కాన్ఫరెన్స్ హాల్ లో సింగరేణి సెక్యూరిటీ విభాగం పనితీరు, సంస్థ ఆస్తుల పరిరక్షణలో అనుసరించాల్సిన వ్యూహాలు, పోలీస్ విభాగంతో సమన్వయం వంటి అంశాలపై నిర్వహించిన బెల్లంపల్లి రీజియన్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సెక్యూరిటీ విభాగం, పోలీస్ విభాగం సమన్వయంతో సంస్థ ఆస్తులను రక్షించాలని సూచించారు. S&PC విభాగం రోజు వారి వ్యవహారాలు, ఎదురవుతున్న సవాళ్లపై విశ్లేషించారు.

సింగరేణి సెక్యూరిటీ విభాగం సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం అనుసరిస్తున్న విధానాలను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి , మందమర్రి సెక్యూరిటీ ఆఫీసర్ రవి. ముఖ్యంగా స్క్రాప్ దొంగల నుంచి నిత్యం ఎదురవుతున్న సవాళ్లు, వారిని పట్టుకున్నా వస్తున్న ఒత్తిళ్లు, ఎఫ్ఐఆర్ ల స్టేటస్ తదితర అంశాలను  వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్  ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి, మందమర్రి సెక్యూరిటీ ఆఫీసర్ రవి, శ్రీరాంపూర్ & మందమర్రి ఏరియాల S&PC ఇన్స్పెక్టర్ లు, జమేదార్ లు, ఇంటలిజెన్స్ గార్డ్స్, ఏం. టి. ఎఫ్  సిబ్బంది పాల్గొన్నారు.