20 May, 2026 | 1:06 PM

నా అన్ని సినిమాల్లోకెల్లా రెట్రో ప్రత్యేకం

08-02-2025 12:00 AM

పూజా హెగ్డే ఇప్పుడిప్పుడే కెరీర్‌లో తిరిగి బిజీ అవుతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటిస్తోంది. ఇటీవలే ‘దేవా’ సినిమాతో జర్నలిస్ట్ దియా పాత్రలో పూజా ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘రెట్రో’ అనే చిత్రంలో నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో సినిమా రూపొందుతోంది.

సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సినిమాలో పూజా ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తోందట. “నేను ఇప్పటి వరకూ నటించిన సినిమాలన్నింటి కంటే ‘రెట్రో’ చాలా ప్రత్యేకం.

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, దానిని చిత్రీకరించిన తీరు.. వాటిలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సెట్‌లో టీమ్ అంతా చాలా కష్టపడి పని చేశారు. నా పాత్రను చక్కగా రూపొందించారు.

అయితే సినిమా ఎడిటింగ్‌లో ఉండటం కారణంగా నేనింకా పూర్తిగా సినిమాను చూడలేదు. సినిమాను చూడకుండానే ఇంత నమ్మకంతో ఉన్నానంటే చూసిన తర్వాత ఇంకెలా ఉంటానో చూడండి” అని పూజా హెగ్డే తెలిపింది.