స్పెషల్‌గా బాలీవుడ్‌లోకి..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే భామలు ఇండస్ట్రీలో ఎక్కువ మందే ఉంటారు. అందుకే ఈ మాట చిత్రసీమలోనే ఎక్కువ సార్లు వినిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో హీరోయిన్లు ఇంకా ముందుంటారు. ఓ వైపు హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు ప్రత్యేక గీతాలతో మెప్పించేందుకు తహతహలాడేందుకే కథానాయికల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, శ్రీలీల, రెజీనా కసాండ్ర, ఫరియా అబ్దుల్లా వంటి హీరోయిన్లు ఇప్పటికే ఐటమ్ గాళ్స్‌గా తెరపై సందడి చేశారు. త్వరలో ఈ జాబితాలోకి కృతిశెట్టి పేరూ చేరబోతోందనే టాక్ వినవస్తోంది. గత ఏడాది విడుదలైన ‘మనమే’ సినిమా తర్వాత కృతి.. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఏ చిత్రంలోనూ కనిపించింది లేదు.
అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి స్పెషల్ ఆఫర్ వచ్చిందని సమాచారం.
అయితే ఏ సినిమానో, మిగతా వివరాలేంటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తెలుగునాట అడుగుపెడుతూ తొలి చిత్రంతోనే తన గ్లామర్‌తో ప్రేక్షకుల గుండెల్లో ‘ఉప్పెన’ సృష్టించిన ఈ బేబమ్మ..
మరింత ‘ప్రత్యేక’ గుర్తింపును కోరుకుంటోంది. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ కుట్టి.. బాలీవుడ్ స్పెషల్ ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌కి చేరుతుందో లేదో చూడాలి!






