calender_icon.png 7 February, 2026 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి వైభవంగా పట్టువస్త్రాల సమర్పణ

07-02-2026 06:43:14 PM

భీమేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు – బద్ది పోచమ్మకు సారె

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి భావం వెల్లివిరిసింది. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, బద్ది పోచమ్మ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆరు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ సేవా సమితి సభ్యులు ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి శ్రీమతి ఎల్. రమాదేవి హాజరై స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారి వెంట ఏఈఓలు శ్రావణ్ కుమార్, అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివ సాయి, పురాణ వంశీ మోహన్ శర్మ, అకౌంట్స్ విభాగానికి చెందిన ఆగమ రావు తదితరులు పాల్గొన్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.