calender_icon.png 10 November, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మృతికి కారణం చెప్పిన గాంధీ వైద్యులు

10-11-2025 11:51:26 AM

అందెశ్రీ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యుల అధికారిక ప్రకటన 

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ ఉదయం 7.20కి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. లాలాపేటలోని నివాసానికి అందెశ్రీ పార్థివదేహం తరలించారు. రేపు ఘట్‌కేసర్‌లో పోలీసు లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందెశ్రీ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు(Gandhi Hospital Doctors) అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అందెశ్రీని ఉదయం 7.20 గంటలకు గాంధీ ఆస్ప్రతికి తీసుకువచ్చారు. అందెశ్రీ గుండెపోటుతో చనిపోయారని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్‌ హెచ్‌వోడీ(Gandhi Hospital General Medicine HOD) సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. గత 15 ఏళ్లుగా అందెశ్రీకి హైపర్‌ టెన్షన్‌ ఉందని చెప్పారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నా.. అందెశ్రీ వైద్యులను సంప్రదించలేదని తెలిపారు. అందెశ్రీ నెల రోజుల నుంచి మందులు‌ వాడటం లేదని సునీల్ కుమార్ పేర్కొన్నారు. రాత్రి భోజనం చేశాక మామూలుగానే వెళ్లి పడుకున్నారని చెప్పారని తెలిపారు. ఉదయం వెళ్లి చూస్తే కిందపడి ఉన్నారని కుటుంబసభ్యులు చెప్పారని సునీల్ కుమార్ స్పష్టం చేశారు.