10-11-2025 12:12:24 PM
హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను క్రికెట్ బ్యాట్‌తో(Cricket Bat) కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్(Aminpur) పట్టణం కేఎస్ఆర్ నగర్‌లో జరిగింది. కేఎస్ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బ్రహ్మయ్య- క్రిష్ణవేణి భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇంటర్ చదివే ఒక కూతురు, 8వ తరగతి చదివే బాలుడు ఉన్నారు.
క్రిష్ణవేణి సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వివాహేతర సంబంధంపై వీరిద్దరికి ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగిపోవడంతో తరచూ గొడవలు జరిగేవి. గొడవలు కాస్త పెరిగిపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన భర్త చేతికి దొరికిన క్రికెట్ బ్యాట్‌తో క్రిష్ణవేణి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.