6 July, 2026 | 9:19 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

ప్రభుత్వ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నా అధికారులను సస్పెండ్ చేయాలి

19-06-2025 06:55 PM

మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనీ సమావేశ మందిరంలో బుధవారం విధుల సమయంలో పంచాయతీ రాజ్ ఏఈఈ జగదీశ్(Panchayat Raj AEE Jagadish) పుట్టినరోజు వేడుకలు అధికార పార్టీకి చెందిన నాయకులు, అధికారుల మధ్య జరుపుకోవడంతో గురువారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్ బిఆర్ఎస్ నాయకులతో కలసి అధికారులను విధుల నుండి తొలగించాలని పెద్దపల్లి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దానికి ఉదాహరణగా ప్రభుత్వ కార్యాలయంలో ఏ.ఈ.ఈ  జన్మదిన వేడుకలు నిలిచాయన్నారు. విధుల సమయంలో విధులు నిర్వహించవలసిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి ఎంపీడీవో సమావేశ మందిరంలో రోజంతా జన్మదిన వేడుకలు నిర్వహించారని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విధులు నిర్వహించకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నా అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, బీరం రమేష్, నాగార్జున, తీగల నాగరాజు, కొమురయ్య, చందు, దేవన్న, రాజ్ కుమార్, మల్లేష్, వెంక్కన్న, రవీందర్ పాల్గొన్నారు.