ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్.. డబుల్.. రూ 146 వద్ద అప్పర్ సర్క్యూట్
19-08-2024 03:37 PM
ముంబాయి: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ వరుసగా అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. సోమవారం నాటి ట్రేడింగ్ లో ఎన్ఎస్ఈలో 9.99 శాతం పెరిగి రూ. 146.38 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలిజమేన 64,565.73 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజి సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల వైఖరి వ్యక్తం చేసినందున ఓలా స్టాక్ రాణిస్తోందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.






