16 July, 2026 | 11:01 PM

ఏఐ క్రియేటెడ్ ఆహార పదార్థాల చిత్రాలను తొలగిస్తాం: జొమాటో

19-08-2024 03:27 PM

కృత్రిమ మేధ ఆధారంగా క్రియేట్ చేసిన ఆహార పదార్థాల చిత్రాలను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించనున్నట్లు జొమాటొ సీఈవో దీపేంద్ర గోయల్ వెల్లడించారు. అలాంటి చిత్రాలు కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జొమాటొ వారి మెనూ కార్డ్‌ల నుంచి భాగస్వామ్య రెస్టారెంట్లు వారి వంటకాల కోసం AI- రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిత్రాల నాణ్యతను మెరుగుపరచడానికి PicNic-AI అనే కొత్త AI మోడల్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త మోడల్ మెనూ కార్డు తయారీలో భాగంగా అటు దృశ్యమానంగా ఉంటూనే  అధునాతన ఫోటోగ్రఫీ నైపుణ్యాలు, పరికరాలు అవసరం లేకుండా తీసే ఫోటోలను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత రెస్టారెంట్ భాగస్వాములకు సహాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు .