పాత రాతియుగం పనిముట్టు
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్ ఇద్దరు మంచిరేవుల ఎదురుగా రోడ్డుకు అవతల ఉన్న బీరప్పగుడి వెనక (టిఎస్‌ఐఐసి311) గుట్ట మీద శిలాశ్రయం దగ్గర ఒక క్వార్ట్ పనిముట్టును గుర్తించారు. రాతి పనిముట్టు 7 సెం.మీ.ల పొడవు, 11సెం.మీ.ల చుట్టు కొలతలతో ఉన్నది.
ఆ పనిముట్టు ఫోటోను చూసి న ప్రొ.రవి కొరిసెట్టర్(ధార్వార్డ్ యూనివర్సిటి) అది ఎగువ పాతరాతియుగం క్వార్ట్ పాయింట్ అని చెప్పారు. ఈ ఎగువ పాతరాతి యుగం ఇండియాలో 40,000 సం. ల మధ్యకాలంలో ఉంటుంది. ఎగువ పాతరాతియుగంలో పురామానవులు క్వార్టుటై, క్వార్ట్, ఛెర్ట్ రాళ్ళతో పనిముట్లు చేసుకునే వారు. ఇపుడు లభించిన క్వార్ట్ పాయింట్ చిన్న రాతిగొడ్డలి వలె కనిపిస్తున్నది. ఈ పాతరాతియుగం పనిముట్టు లభించడం హైద్రాబాద్ చరిత్రలో ఒక మైలురాయి.




