24 March, 2026 | 3:50 AM

19న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే రన్

18-06-2025 12:00 AM

జిల్లా ఒలంపిక్ రన్ కన్వీనర్  కరుణాకర్ రెడ్డి వెల్లడి

కామారెడ్డి,  జూన్ 17 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే రన్ 2025 కమిటీ  ఆధ్వర్యంలో ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీన,  39వ ఒలంపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలంపిక్ రన్ కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మంగళవారం కామారెడ్డిలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు  కమిటీ సభ్యు లు, వ్యాయామ సంఘాల ప్రతినిధులు   విద్యార్థులు విద్యార్థినిలు యువకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా పోషకులు, వాకర్స్ అసోసియేషన్,  తదితర సంఘాలు అందరూ పాల్గొని ఈ ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయాలని ఒలంపిక్ రన్  కన్వీనర్ నల్లవెల్లి కరుణాకర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.