10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కరీంనగర్ రూరల్ మండలంలో బడిబాటలో విస్తృతంగా పాల్గొన్న సుడా చైర్మన్

18-06-2025 12:00 AM

కొత్తపల్లి, జూన్ 17:కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్,దుబ్బపల్లి,చామన్ పల్లి, నగునూర్ గ్రామాల బడిబాట కార్యక్రమాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన అన్ని పాఠశాలలోని కొత్తగా చేరిన విద్యార్థులు దాదాపు వంద మందికి స్వయంగా స్కూల్ బ్యాగులు అందజేశారు.

పాఠశాలల్లోని అందరు విద్యార్థులు దాదాపు అయి దు వందల మందికి నోట్ బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వాతావరణం గాని భోదన గాని వేరే దగ్గర ఉండదని అన్నారు. చర్లభుత్కూర్, దుబ్బపల్లి,చామన్ పల్లి, నగునూర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగానే ఉందని స్థానిక నాయకుల సహకారంతో పాటు ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

చర్లభూత్కూర్ పాఠశాలలో ఈజీయస్ నిధులతో నూత న ప్రహరీ గోడ మరియు గేటు నిర్మాణ పనులకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశా రు.ఈ కార్యక్రమాలలో ఎంఈవో రవీందర్,ఎంపిడివో సంజీవ రావు,కంరెడ్డి రాంరెడ్డి, సాయిని తిరు పతి, పెంచలా లక్ష్మన్ రావు,నరేష్ రెడ్డి,నారాయణ గౌడ్, స్వామి గౌడ్, ప్రశాంత్ రెడ్డి, అల్వలా శ్రీకాంత్,అల్వలా ప్రశాంత్,జగ్గని కనకయ్య, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య,రాజు, తాండ్ర లక్ష్మన్, శేఖర్,రాజేష్ కన్నా, అధ్యాపకులు బోధనా సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.