ప్రజల వద్దకే ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’
షాద్నగర్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు వేగవంతంగా పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు కొత్తగా ‘Onsite FIR‘ (సంఘటనా స్థలంలోనే కేసు నమోదు) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండన్నగూడ గ్రామంలో ఓ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతనం జరిగింది.
బాధితురాలు వీరమ్మ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆమె తన పొలం వద్ద కూర్చుని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైక్పి వచ్చాడు. బైక్ను కొంత దూరంలో ఆపి, వెనుక నుండి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు.
సమాచారం అందిన వెంటనే షాద్నగర్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ సీతారాం , ఎస్త్స్ర శివారెడ్డి, సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ‘Onsite FIR‘ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత కోసం ఇలాంటి మరిన్ని ఆధునిక పద్ధతులను అమలు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.




