10 April, 2026 | 1:59 AM

వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అనుసరించాలి: ఎస్పీ నరసింహ

10-04-2026 12:00 AM

సూర్యాపేట, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : వాహనదారులు తప్పక ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించాలనీ ఎస్పి నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా అమర్చుకతున్న ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్లకు కొత్త బస్టాండ్ వద్ద ఆ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. .

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా ప్రజలను వాహనదారులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పి ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం పాల్గొన్నారు.