15 July, 2026 | 12:12 AM

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చు

02-10-2024 12:26 AM

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వెసులుబాటు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వేడుకల్లో పాల్గొనడానికి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వెసులుబాటు కల్పించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్‌వాడీ సిబ్బందికి వెసులుబాటు కల్పిస్తూ అధికారులు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అంగన్‌వాడీలో విధులు నిర్వర్తించి, అనంతరం బతుకమ్మ పండుగలో పాల్గొనవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.