15 July, 2026 | 12:07 AM

గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

15-07-2026 12:07 AM

జి.సి.డి.ఓ శకుంతల 

బెజ్జూర్ జులై 14 (విజయ క్రాంతి) బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జి సి డి ఓ శకుంతల మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేసిన భోజనం ను పరిశీలించి, స్టోర్ రూమ్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ శ్రీనివాస్ కు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు బోధించే విధానంను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏమైనా అర్థం కాకపోతే మళ్లీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ప్రధాన ఉపాధ్యాయురాలు మారుబాయి ఉపాధ్యాయులు ఉన్నారు.