షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
ముషీరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): అంబర్‌పేట ఛే నెంబర్ చౌరస్తా సమీపంలోని ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో షార్ట్ సర్క్యూర్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. అంబర్ పేట పోలీసులు, సర్వీసింగ్ సెంటర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహేంద్ర సర్వీసింగ్ సెంటర్‌లో గోదాంలో నుంచి స్వల్పంగా పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పోలీసులకు, ఫైర్ ఇంజన్ సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కార్లకు సంబంధించిన ఎక్ స్ట్రా ఫిటింగ్ మెటీరియల్ పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 25 లక్షల పైచిలుకు ఆస్తి నష్టం జరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెగిసిపడుతున్న ఘట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వీసింగ్ సెంటర్ లో ప్రమాదం జరిగిందని పోలీసులు సిబ్బంది తెలిపారు. ఈ మేరకు అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






