15 April, 2026 | 3:18 AM

విద్యుత్ షాక్‌తో ఒకరికి తీవ్ర గాయాలు

09-06-2025 11:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్(Nirmal) మండలంలోని అక్కాపూర్ 220 కేవీ సబ్ స్టేషన్‌లో సోమవారం విద్యుత్ షాక్‌తో దేవన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 11 విద్యుత్యోగి దేవన్న ఎల్సి తీసుకొని మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా సప్లై కావడంతో విద్యుత్ షాక్‌ గురై కింద పడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో ఆయనను వెంటనే నిర్మల్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు సందర్శించి విచారణ జరుపుతున్నారు.