calender_icon.png 21 February, 2026 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొమ్ము ఒకరిది సోకు మరొకరిది

21-02-2026 12:00:00 AM

  1. కార్పొరేటర్‌గా నా హయంలో మంజూరైన కోట్ల రూపాయల నిధులతో ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందనంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పనితీరు ఉన్నదని ఆయన వింతపోకడలు అందుకు నిదర్శనం అని మైలార్ దేవ్ పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంటె స్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు కార్పొరేటర్ గా గెలుపొందడం జరిగిందని కోట్లాది రూపాయలు నిధులు రాబట్టి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించినట్లు ఆయన తెలిపారు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 114 కోట్ల రూపాయలు నిధులు రాబట్టి. మంచినీరు, శివరేజ్ లైన్, సీసీ రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హల్స్ , కాటేదాన్ మినీ స్టేడియం, బస్తీలలో మరుగు సమస్యకు పరిష్కారం, విద్యుత్ సమస్యలు,

పబ్లిక్ పార్కుల వంటి అభివృద్ధి చేపట్టడం జరిగింది అని చెప్పుకుంటూ పోతే డివిజన్ అభివృద్ధికి ఒక కార్పొరేటర్ గా చేయాల్సిన అభివృద్ధి అంతా చేసి చూపించానని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి తన కార్పొరేటర్ పదవి కాలం ముగిసిన నాటి నుంచి, తాను మంజూరు చేయించిన నిధులతో ఎమ్మెల్యే తానేదో సాధించి నట్లు గొప్పలకు పోతూ ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేయడం హాస్యపం దంగా ఉందన్నారు.

జిహెచ్‌ఎంసి, వాటర్ వరక్స్, శివరేజ్ బోర్డు, ఏర్పాట్ల కోసం జిహెచ్‌ఎంసి సంబంధిత అధికారులతో సంప్ర దించి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ నిధులే కాకుండా ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల మధ్య ఉంటానని ఆయన పేర్కొన్నారు.

మునుపెన్నడు ప్రజా సమస్యలపై పర్యటించని ఎమ్మెల్యే తన పదవి కాలం పూర్తి కాగానే అర్థరాత్రి సమయాల్లో శిలాఫలకాలు ఏర్పాటు చేయించి ఫోటోకాల్ కూడా పాటించకుండా శంకుస్థాపన చేస్తూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాష్ గౌడ్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో తాను ఎప్పటికీ ఉంటానని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో రాజేంద్ర నగర్ బి జె పి అధ్యక్షుడు పాండు యాదవ్,

రావుల భాస్క ర్, బుచ్చి రెడ్డి, సంతు గౌడ్, మాజీ అధ్యక్షుడు అడికే జనార్ధన్, ఎల్ వి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బబ్లూ, ఎన్ను శంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సియచ్ ప్రభుదాస్, పృధ్వీ రాజ్,సీ ఎచ్ రఘునాథ్,రాజ్ కుమార్, గోపాల్ నాయక్, కుర్మయ్య, బి.రామ కృష్ణ, రామ రావు, శేఖర్, సురేష్, దినకర్, జి శంకర్, శ్రవణ్, మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.