8 May, 2026 | 8:23 PM

మాపై రూ.1.50 కోట్లు ఖర్చు చేశారా?

14-08-2024 12:05 AM

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో అశ్విని పొన్నప్ప కాస్ట్రో జోడీ నిరాశపరిచింది. గ్రూప్ దశలోనే ఈ జంట వెనుదిరగడంతో వారి ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) అశ్విని జంటపై రూ.1.50 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అశ్విని ఖండించింది. ‘1.50 కోట్లా? మాకెవరిచ్చారు. ఎందుకోసం ఖర్చు చేశారు. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదు. శిక్షణ నిధుల కోసం ఏ సంస్థ మాకు ఇవ్వలేదు. టాప్ పథకంలో కూడా నేను భాగం కాలేదు. పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే నన్ను టాప్‌లో భాగం చేశారు. గేమ్స్ పూర్తయ్యే వరకు మాత్రమే నన్ను అందులో ఉంచారు. ఇవన్నీ తప్పుడు వార్తలు’ అని పొన్నప్ప తెలిపింది.