21 May, 2026 | 3:17 AM

ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి

21-05-2026 02:00 AM

చిట్యాలలో మెడికల్ షాపుల బంద్, భారీ ర్యాలీ

చిట్యాల, మే 20 : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిట్యాల పట్టణంలో మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని, నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టారు. అలాగే మందుల అక్రమ అమ్మకాలను నియంత్రించాలని, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అధిక డిస్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నకిలీ మందుల విక్రయాలను పూర్తిగా నివారించాలని డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణం, మండల వ్యాప్తంగా మెడికల్ షాపులు మూసివేసి బంద్ పాటించారు.

అనంతరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో  అధ్యక్షుడు వల్లపు నరేందర్, గౌరవ అధ్యక్షుడు అంతటి అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు ఏనుగు శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి బైరంకొండ భాస్కర్, సభ్యులు ఎస్.వెంకన్న, అంతటి స్వామి, నవీన్ రెడ్డి, జి. శ్రీనివాస్, గంజి గోవర్ధన్, శ్రీశైలం, లింగస్వామి, నగేష్, భరత్, అరుణ్ కుమార్, రాజశేఖర్, వెంకటేశం, విక్రమ్, భాష, రాకేష్ గౌడ్, మధు, దుర్గయ్య, మెహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.