23న వేద పాఠశాలకు భూమిపూజ
21-05-2026 02:01 AM
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానo
యాదగిరిగుట్ట,మే 20 : ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని ఈ కార్యక్రమాలకు మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించడం జరిగిందని ఈవో భవాని శంకర్ బుధవారం విలేకరులకు తెలిపారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు, ఆధ్యాత్మిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఆయనతోపాటు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.






