యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్టులు
యాదగిరిగుట్ట మే 20: యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట వర్తక సంఘం ను రద్దు చేసి టెండర్ వేయాలని కోరుతూ ’మన గుడి మన వ్యాపారం’ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు, నిరుద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్ని భక్తులకు కొబ్బరికాయలు అమ్మడం జరిగింది.
దేవస్థానం పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పోలీస్ లు వారిని ముందస్తు అరెస్టులు చేశారు. తదుపరి వారిని స్థానిక పోలీస్ స్టేషన్, తుర్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య,కల్వకొలను సతీష్, కర్రె ప్రవీణ్, బుగ్గా ఆంజనేయులు,బండి వాసు,బండి అనిల్,పబ్బాల ఉప్పలయ్య, ముక్కెర్ల వెంకటేష్,చిన్న రాజు,నరసింహ, పెద్ద రాజు,గోపగాని ప్రసాద్,కర్రె శ్యామ్, మందోజు నరేష్,కొన్నె సంజీవ, దొమ్మాట ప్రభాకర్,గుండు కుమార్, సుధాగాని శివ,కొన్నె ప్రశాంత్, సుడుగు వెంకట్ రెడ్డి, కంబాల నర్సింహా,పల్లపు రవి,నక్కల శివ, ఆవుల రాజు,బండ శేఖర్,బండ శ్రీకాంత్, జోగు మహేష్,విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






