8 March, 2026 | 4:59 AM

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు ఒకే

07-03-2026 12:29 AM
  1. భారత్‌కు ౩౦రోజుల సమయం ఇచ్చిన అమెరికా 

షిప్పుల్లో లోడైన చమురుకే అనుమతి

వాషింగ్టన్, మార్చి 6 : భారత్.. రష్యా నుంచి ముడి చమురు కొనేందుకు అమెరికా తాత్కాలికంగా అనుమతిచ్చింది. ఇదే రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేయాలని గతేడాది అమెరికా చాలాసార్లు ఒత్తిడి తెచ్చింది. రష్యా దగ్గర భారత్ చమురుకొంటే.. ఆ డబ్బుతో రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధంచేస్తోందని మెలికపెట్టింది. అంతేకాదు.. భారత్‌పై ట్రంప్ 25 శాతం అదనపు టారిఫ్ కూడా వేశారు. ఇప్పుడు..

గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా సమస్యలు తలెత్తుతుండడంతో రష్యా నుంచి కొనుక్కోమని చెబుతున్నారు. ఇందు కు నెల రోజులపాటు గడువిచ్చింది. దీంతో ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటుంది. ఆ లోపు యుద్ధం ముగిసిపోతే, ఇండియాకి చమురు సమస్యలు ఉండవు. ఈ అనుమతి  అనేది.. ఇప్పటికే సముద్రంలోని షిప్పుల్లో లోడైన చమురుకే వర్తిస్తుందని చెప్పింది.