13 June, 2026 | 2:23 AM

పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం

13-06-2026 01:21 AM

మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టి ఎమ్మెల్యే:సిహెచ్ మల్లారెడ్డి

మేడ్చల్ అర్బన్, జూన్ 12(విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టి ఎమ్మెల్యే, మాజి మంత్రి  చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్  లోని సరస్వతి నగర్ కాలనీతో పాటు అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లారెడ్డి పాఠశాలలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనపై ఎంతో నమ్మకంతో మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా మాట్లాడారు.నియోజకవర్గంలోని ప్రజల వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకే వరుసగా నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కావడం మాకు ఇష్టం లేకనే తక్కువ ఫీజుతో విద్యను అందించాలని నూతన పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్.ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్.మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి లతో పాటు  చిర్ల దయానంద్ యాదవ్.ఎల్లంపేట్ మున్సిపల్ వైఎస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి.మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి.చిన్నోళ్ల భాస్కర్, మాజీ కౌన్సిలర్ లు తుడుం గణేష్.సందీప్ గౌడ్ లతో పాటు మాజీ సర్పంచ్ అప్పమ్మగారి జగన్ రెడ్డి.వీర్లపల్లి రాజ మల్లారెడ్డి నాయకులు గోమారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.