19 May, 2026 | 5:21 AM

కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు

19-05-2026 12:00 AM

విద్యార్థులకు నగదు పురస్కారం

భీమదేవరపల్లి, మే 18( విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ జి.ఎస్.ఎస్.ఆర్.ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కావేరి విత్తన సంస్థ చైర్మన్ గుండవరపు వెంకట భాస్కర్ రావు పూలబొకే,శాలువా,నగదు బహుమతులను అందజేసి పదవ తరగతి ఉత్తీర్ణులై అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిచ్చారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించే వీలు ఉంటుందని అన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రతినెల ఈ పాఠశాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో విద్య అందించడం జరుగుతుందన్నారు. అనంతరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన బొంతల సృజన, జక్కుల శివకుమార్, మెరుగు సంహిత, గడ్డం తేజశ్రీ, గడిపి ఉత్తేజిత, భూక్య శ్రీలత, జనగం సుధీష్ణ, బైరి అక్షయ, అంజన్న లను సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డోరి రమేష్, సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్, మండల విద్యాధికారి ఎం.సునీత, ఉపసర్పంచ్ బోడిగే శ్రీనివాస్, , కావేరి సూపర్వైజర్ రాంకిషన్ రాజు, ఉపాధ్యాయులు ఎ .శ్రీనివాస్ రెడ్డి, కామరపు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. వెంకటేశ్వర్లు  విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.