ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
ఎమ్మెల్యే మందుల సామెల్
నూతనకల్, మే 18: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు వీలుగా లారీల సంఖ్యను తక్షణమే పెంచాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిదర్ రెడ్డి,ఎస్త్స్ర నాగరాజు,ప్యాక్స్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే18: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చెప్పారు.జాజిరెడ్డిగూడెం మండలంలోని కోడూరు గ్రామం నుండి మర్రిబాయితండా వరకు రూ.కోటి 68 లక్షల ఎస్టీ ఎన్డీఎఫ్ నిధులతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అర్వపల్లి నుండి కొమ్మాల బీటీ రోడ్డు రెన్యువల్ కు రూ.9కోట్లతో అంచనాలు రూపొందించారని,త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.నియోజకవర్గంలో అర్హులైన పేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన వృద్ధులు,వికలాంగులు,వితంతువులకు నూతన పెన్షన్లు అందిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత ఉన్నట్లయితే రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం కొమ్మాల గ్రామంలో మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాల కేంద్రాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానందచార్యులు, డీసీసీ ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వేల్పుల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపాక సత్యం,శిగ నసీర్ గౌడ్, జిల్లా నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి, సర్పంచ్ లు కుంటిగొర్ల శ్రీనివాస్, లూనావత్ కృష్ణనాయక్, విద్యాసాగర్, కృష్ణమూర్తి, లలితారామ్మూర్తి, వెంకటమ్మ, ఉపసర్పంచ్ ఉమావెంకన్న, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ,పీఆర్ డీఈ బాబురావు,ఏఈ కుమారస్వామి,నాయకులు ఎల్పోజు నరేష్, బీరెల్లి శ్రీధర్ రెడ్డి,బౌరోజు ఉపేందర్,దల్వాయి శ్రీధర్,చిక్కుల శేఖర్,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.






