11 June, 2026 | 3:23 PM

49వ డివిజన్‌లో ఓపెన్ జిమ్ ప్రారంభం

11-06-2026 02:14 PM

ముకరంపుర, జూన్ 11(విజయ క్రాంతి): కరీంనగర్ లోని 49వ డివిజన్ పరిధిలోని న్యూ కురుమవాడ లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఓపెన్ జిమ్'ను మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు కలిసి ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపునిచ్చిన 'ఫిట్ ఇండియా' నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్   సహకారంతో, సీఎస్ఆర్ నిధులను వెచ్చించి నగరంలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు. అనంతరం బద్ది పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు .ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి-ప్రకాష్,  కార్పొరేటర్లు కర్రే పద్మ-అనిల్ కుమార్, గాజ రమ-శివరాంలతో పాటు పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.