19 April, 2026 | 4:14 AM

ప్రజల ఆరోగ్యం కోసమే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు

02-07-2025 01:03 AM

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు, జూలై 1 : ఆమనగలు మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఓపెన్ జిమ్ముల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శారీరక మానసిక ఒత్తిడీలు దూరం కావాలంటే ప్రతి ఒక్కరు తమ దినచర్యలో వ్యాయామం భాగస్వామ్యం చేసుకోవాలని అప్పుడే ఆరోగ్యవంతమైన జీవన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం ఆమనగల్లు మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 లక్షల నుంచి కొనుగోలు చేసిన ఓపెన్ జిమ్ లను పట్టణంలోని ధరణి, కె.వి.ఆర్ వెంచర్ల లో ఏర్పాటు చేసిన జిమ్ ల ను రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాసింగ్, కమిషనర్ శంకర్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు తమ పిల్లలతో కలిసి వ్యాయమం చేసుకునేందుకు వీలుగా జిమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.

ము న్సిపాలిటీ ప్రజలంతా ఇట్టి ఓపెన్ జిమ్ ల ను సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే మున్సిపాలిటి లో చిన్నారులు, వయోవృద్ధుల కోసం ఆహ్లదకరమైన వాతావరం కల్పిం చేందుకు వీలుగా ప్రత్యేకమైన పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీని ఇచ్చారు. రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువలను ఎమ్మెల్యే పరిశీలించి....

అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టి త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పట్టణం లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయడంతో ప్రజలు హార్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీత, డైరెక్టర్ రవి, ఏఈ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ లు సత్యనారాయణ,దామోదర్, అప్రోజ్, ఉపేందర్రెడ్డి, ఎల్లయ్య, నాయకులు కేశవులు, శ్రీనివాస్ రెడ్డి, మంగ్లీ రాములు, యాట నరసింహ, ఖాదర్,ఖలీల్, శ్రీనివాసరెడ్డి, సుమన్, కృష్ణ నాయక్, బాబా, కండేసాయి, విజయ్, మైసయ్య, భీష్మ,పర్వతాలు, సత్యం పాల్గొన్నారు.