19 April, 2026 | 6:00 AM

రెండు రోజుల్లో ఖాతాల్లోకి బెస్ట్ నిధులు

02-07-2025 01:02 AM
  1. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి హామీ 
  2. నిన్నటివరకు బిల్లులు చెల్లించక అడ్మిషన్లు చేపట్టని ప్రైవేట్ బడులు
  3. మంత్రి హామీతో విద్యార్థులను స్కూళ్లలో చేర్చుకునేందుకు ఆసక్తి

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ (బీఏఎస్)ను అమలు చేసే స్కూళ్లకు, ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట లభించింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ స్కూళ్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఒకటి రెండు రోజుల్లో నిధులు జమ అవుతాయని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు.

దీంతో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించేందకు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ముందుకొచ్చాయి. సోమవారం వరకు కూడా ఈ విద్యాసంవత్సరా నికి సంబంధించిన అడ్మిషన్లు చేపట్టేందుకు ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ముం దుకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. జూలై నెల వచ్చినా తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈక్రమంలోనే మంగ ళవారం సంబంధిత శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడు తూ 2025, ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రకటించడంతో ఈ స్కీమ్ కింద ఉచితంగా అడ్మిషన్లు పొం దిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రైవేట్ స్కూళ్ల యాజ మాన్య సంఘాల నేతలు తెలిపారు. 2022 23 నుంచి 2025, ఏప్రిల్ వరకు దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తెలిపాయి.

మూడేళ్ల నుంచి పెండింగే..

రాష్ట్రవ్యాప్తంగా 200 స్కూళ్లలో బీఏఎస్ స్కీం అమలవుతుంది. జి ల్లాకు 5 నుంచి 10 వరకు ఈ స్కూ ళ్లు ఉన్నాయి. ఒక్కో జిల్లాల్లో 500 నుంచి వెయ్యి వరకు ఈ స్కీమ్ కింద అడ్మిషన్లుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గా 25 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 25 వేల సీట్లలో ఎస్సీలకు 18 వేలు, ఎస్టీలకు 7 వేల సీట్లు ఉంటాయి. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి జి ల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి సీటు కేటాయిస్తారు.

స్కూళ్లలో సీటు పొందిన విద్యా ర్థులకు ఉచితంగా డేస్కాలర్స్, రెసిడెన్షియల్ విద్యనందిస్తారు. ఎస్సీ విద్యార్థులకు ఒకటో తరగతిలో, 5వ తరగతిలో ప్రవేశాలుంటే, ఎస్టీ విద్యార్థులకు మూడు, ఐదు, ఎనిమిదో తరగతిలో ప్రవేశాలుంటాయి. వీరు పదో తరగతి వరకు ఉచితంగానే చదువుకుంటా రు. ఇందుకుగానూ హాస్టల్ విద్యార్థి ఒక్కోక్కరికి రూ.42 వేలు, డేస్కాలర్ విద్యార్థికి రూ. 28 వేలను ప్రభుత్వమే చెల్లిస్తోంది.

ఈ స్కీం కింద చేరే విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు, కాస్మోటిక్స్  యాజమాన్యాలు అం దించాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన బకాయిలు మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉండటంతో బకాయిలు చెల్లిస్తేనే అడ్మిషన్లు చేపడతామని యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో వాటిని క్లియర్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. 

ప్రభుత్వానికి ధన్యవాదాలు

2025 ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు లేదా రేపు నిధులు పడతాయి. మంత్రి ప్రకటించడంతో బెస్ట్ అవైలబుల్ స్కీం అడ్మిషన్లను తీసుకోవాలని అందరికీ చెప్పాం. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.

 శేఖర్‌రావు, ట్రస్మా గౌరవ అధ్యక్షులు,

బీఏఎస్ పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి

జేబుల నుంచి డబ్బులు పెట్టుకున్నాం

ప్రభుత్వం సకాలంలో పెండింగ్ నిధులను విడుదల చేయకపోవటంతో పాఠశాలల నిర్వహణ భారంగా మారుతోంది. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, భోజనాలకు కావాల్సిన డబ్బులు మా జేబులోంచి పెట్టాల్సి వస్తోంది. సేవలో భాగంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్‌ను అమలు చేస్తున్నామన్నారు. అప్పులు తీసుకొచ్చి పాఠశాలలు నిర్వహించాం. సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామనటం సంతోషం.

 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం