11 April, 2026 | 7:30 PM

Breaking News

ఓపెన్ టెన్త్, ఇంటర్ షెడ్యూల్ విడుదల

07-06-2025 01:45 AM

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): 2025-26 నూతన విద్యాసంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశానికి గానూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 12న నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 12 నుంచి ఆగస్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.