వనమహోత్సవంలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
26-08-2026 10:58 AM
కల్లూరు,ఆగస్టు (విజయ క్రాంతి): కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎంపీడీవో చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు,గ్రామస్థులు కలిసి మొక్కలు నాటారు.అనంతరం గ్రామంలో కమ్యూనిటీ సోక్‌పిట్లు, వ్యక్తిగత సోక్‌పిట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించి,ప్రజలకు వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మురుగునీటి నిర్వహణకు సోక్‌పిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,ఏపీవో,సర్పంచ్, ప్రజాప్రతినిధులు,పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






