బడంగ్‌పేట్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
21-05-2024 02:45 AM
మహేశ్వరం, మే 20 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్ల్లా బాలాపూర్‌లో ఇన్నాళ్లు సేవలందించిన ఎమ్మార్వో కార్యాలయం, జాయిం ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలో కొత్త కార్యాలయం లోకి సోమవారం మార్చారు. మొదటి రోజు నుంచే సేవలు ప్రారంభమయ్యాయి. బాలాపూర్ ప్రాంతంలో 2016లో మండల కార్యాల యం మొదట్లో ఏర్పాటు చేశారు. ఏడున్నర సంవత్సరాల అక్కడే సేవలందించారు. ఇప్పటి నుంచి బడంగ్‌పేట్‌లో కొత్త ఆఫీస్ నుంచి సేవలందించనున్నారు. పరిపాలన సౌలభ్యంగా ఉండాలనే సంకల్పంతో మండల కార్యాలయా న్ని మార్చినట్లు తహసీల్దార్ మాధవరెడ్డి తెలిపారు. బడంగ్‌పేట్‌కు కార్యాలయాలు అందు బాటులోకి రావడం వల్ల పౌర సేవలకు మరింత మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






