26 August, 2026 | 4:39 PM

కండరాల వ్యాధిగ్రస్థులకు ఆర్థిక సహాయం

21-05-2024 02:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (విజయక్రాంతి) : తెలంగాణకు చెందిన ఫ్రీమేసన్స్ సంస్థ కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలిచింది. సోమవారం గోషామహల్‌లోని బారాదరి మేసోనిక్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండలం యమ్నాపేట్ గ్రామానికి చెందిన బొక్క పద్మ, నరసింహారెడ్డిల కుటుంబానికి రూ.50 వేల చెక్కును సంస్థ ప్రతినిధులు అందజేశారు. వీరి ఇద్దరు పిల్లలు తేజవర్ధన్(20), మణివర్ధన్(17) చాలా యేళ్లుగా నయంకాని కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఫీమేసన్స్ అసిస్టెంట్ రీజనల్ గ్రాండ్ మాస్టర్లు ప్రొద్దుటూరు వీరభద్రుడు, డా. శ్రీరంగ్ అబ్కారీ, అనిల్ దేశాయ్, రమేశ్ మాట్లాడుతూ.. పిల్లలు జీవించి ఉన్నంత కాలం నెలవారీ ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో సుమారు 100 మందికి పైగా ఫ్రీమేసెన్స్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, అతిథులు పాల్గొన్నారు.