26 August, 2026 | 8:33 PM

గ్రామ కంఠం భూమిని సంరక్షించాలి

21-05-2024 02:44 AM

రాజేంద్రనగర్, మే 20 (విజయక్రాంతి) : బండ్లగూడ జాగీర్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామ కంఠం భూమిని సంరక్షించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆకాష్, బోగాల శ్రీనివాస్  కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్రను కోరారు. ఈ మేరకు సోమవా రం శరత్‌చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందిం చారు. అనంతరం వారు మాట్లాడు తూ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ గ్రామకంఠం భూమి 726 గజాల స్థలంలో గిరిధరి కన్‌స్ట్రక్షన్ సంస్థ వారు రేకుల షెడ్‌ను ఏర్పాటు చేశారన్నారు.

త్వరలోనే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తమ కు అనుమానం ఉందన్నారు. అనధికారికంగా అనుమతు లు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలం ప్రభుత్వానికి సంబంధించింది కావున నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ స్థలం బహిరంగ మార్కెట్‌లో సుమారుగా రూ. 5కోట్లకు పైగా ఉంటుందని, ఇంత విలువైన స్థలాన్ని కాపాడాలని కోరామన్నారు. ఈ మేరకు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.