ప్రభుత్వానికి సేవలు.. తమ కుటుంబానికి కన్నీళ్లు..!
- 15 నెలలుగా జీతాలు లేక కష్టాల్లో ఆపరేటర్లు
- ఆపరేటర్ల టర్మినేషన్ పై ఆందోళన
- ఇరవై ఏళ్ల సేవలకు గుర్తింపు ఇదేనా..?
- న్యాయం చేయాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తుల వెల్లువ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు గ్రామస్థాయికి చేరే ప్రతి దశలో కనిపించే చేతులు ఇవే. రైతుకు పట్టాదారు పాస్బుక్ కావాలన్నా, విద్యార్థికి కులఆదాయ ధ్రువపత్రం కావాలన్నా, వృద్ధుడికి పింఛన్ దరఖాస్తు చేయాలన్నా, ప్రకృతి విపత్తుల సమయంలో నష్టాల నమోదు చేయాలన్నా. తహసీల్దార్ కార్యాలయాల్లో రేయింబవళ్లు కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేది మీ సేవ, టైపిస్టు-కమ్-కంప్యూటర్ ఆపరేటర్లే. కానీ ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్న ఈ సిబ్బంది కుటుంబాల్లో మాత్రం ఇప్పుడు ఆ ర్థిక చీకట్లు అలుముకున్నాయి.
గత 14 నుం చి 15 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్న వీరు, ఇప్పుడు ఉద్యోగ భద్రత కోల్పోయే పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. ఇరవై ఏళ్లుగా రెవెన్యూ శా ఖకు వెన్నెముకలా పనిచేసిన తమను ఒక్కసారిగా పక్కన పెట్టడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరవై ఏళ్ల సేవలకు ఇదేనా ప్రతిఫలం ...?
వేకువజామునే ఇంటి నుంచి బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూట ర్ ముందు కూర్చుంటారు.ప్రజలు తీసుకొచ్చే దరఖాస్తులు స్వీకరిస్తారు. రైతులకు పాస్బుక్లు, విద్యార్థులకు కులఆదాయ ధ్రువపత్రాలు, వృద్ధులకు పింఛన్ దరఖాస్తులు, ప్రభుత్వ పథకాల నమోదు& ఇలా రోజంతా ప్రజల అవసరాలకోసం పని చేస్తూనే ఉంటా రు. అదే కార్యాలయంలో ఇరవై ఏళ్లుగా సేవలందిస్తున్న టైపిస్టు-కమ్-కంప్యూటర్ ఆపరేట ర్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచే స్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు గత 14 నుం చి 15 నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బం ది ప్రస్తుతం తమ కుటుంబాల పోషణకే నానా అవస్థలు పడుతున్నారు.
జీతం లేక& జీవితం భారంగా...
నెలల తరబడి జీతాలు రాక పిల్లల స్కూ ల్ ఫీజులు కట్టలేకపోతున్నామని, ఇంటి అద్దె లు పెండింగ్లో ఉన్నాయని, వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొంతమంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తుండగా, మరికొందరు రాత్రి ళ్లు అదనపు పనులు చేస్తూ బతుకును సాగిస్తున్నారు.కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ఎన్నికలు, వరదలు, రైతుబంధు, దళితబంధు, జనగణ ఏ పని చెప్పినా చేశామని ఇప్పుడు మాత్రం వాళ్ళ గురించి అడిగేవారే లేరని వారు వాపోతున్నారు.
ఉద్యోగాలపై వేలాడుతున్న అనిశ్చితి
ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిగా ని యమితులైన టైపిస్టు-కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలంటూ ఇటీవల ఆదేశాలు వెలువడినట్లు సమాచారం. దీంతో ఇ ప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబా ల్లో మరింత భయం నెలకొంది.ఈ ఉద్యోగాలనే నమ్ముకుని జీవితాన్ని గడిపాం. ఇప్పుడు చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయస్సు కూడా దాటిపోయింది. ఉద్యోగం పోతే కుటుంబం రోడ్డున పడుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర కీలకం...
భూ రికార్డులు, ఆదాయకులనివాస ధ్రు వపత్రాలు, రైతుబంధు, దళితబంధు, ఎన్నికల విధులు, విపత్తుల నిర్వహణ ఇలా ప్రభు త్వ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర ఎం తో కీలకం. అయినప్పటికీ, తమ సమస్యలపై మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని వారు వాపోతున్నారు.
ఖాళీ పోస్టులు ఉన్నా& గుర్తింపు లేదా?
రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 473 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సుమారు 4 వేల జీపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శా ఖల్లో పనిచేసిన వేలాది మంది ఒప్పంద సి బ్బందిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిన నేపథ్యంలో తమకూ న్యాయం చేయాలని కోరు తున్నారు.ప్రభుత్వ పథకాలన్నీ మా చేతుల మీదుగానే ప్రజలకు చేరుతున్నాయి. అలాం టి మాకు కనీస భద్రత కూడా లేకపోవడం బాధాకరం అని వారు అంటున్నారు.
సానుకూల పరిష్కారం కోరుతున్న సిబ్బంది
పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సంబంధిత అధికారులతో నివేదిక తెప్పించుకుని సమస్యను సానుకూలంగా పరిష్క రించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపినట్లు సమాచారం.
ప్రభుత్వ తమన గుర్తించి న్యాయం చేయాలి
ప్రభుత్వ వ్యవస్థ లో తమ విధులు వె న్నుముకగా నిలుస్తా యి. ప్రతి పని మా వి ధులతోనే ముడిపడి ఉంటుంది. కా ర్యాలయాల్లో ప్రజలకు మొదట కనిపించేది తమే, దరఖాస్తుల స్వీకరణ నుంచి స్కా నింగ్, ఆన్లైన్ నమోదు, అప్లోడ్ వర కు అన్ని పనులు తామే నిర్వహిస్తున్నా ము. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. టర్మినేషన్ ఉత్తర్వుల ను వెనక్కి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సునీల్, టైపిస్ట్ ,
కంప్యూటర్ ఆపరేటర్ యూనియన్ రాష్ట్ర నాయకుడు, ఆసిఫాబాద్






